
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం భైరవనిపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొప్పు నాగమల్లేశ్వరి (16) ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవడానికి మాచర్ల పట్టణానికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
బాలిక ఎక్కడికైనా వెళ్లి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాలిక ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టినట్లు తెలిపారు. బాలికను గుర్తించిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
