



పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మాచర్ల జనసేన పార్టీ ఇన్చార్జి భూసా రామాంజనేయులు గారి సహకారంతో మాచర్ల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది.
ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ముస్లిం నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సామరస్యాన్ని చాటుకున్నారు.
